lide

GOOD FOOD REMEDIES

 

1.       నిద్రలేమితో బాధపడుతున్న వారు కొత్తిమీర రసం, పంచదార కలిపిన నీళ్ళను తాగితే ఫలితం ఉంటుంది.

2.       రక్తంలోని కొలెస్టరాల్‌ను తగ్గించుకొని సన్నబడాలనుకునేవారు, ప్రతి రోజూ పెరుగు ఎక్కువగా తీసుకోవటం మంచిది.

3.       రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు మంచి నీళ్లలో పది గ్రాముల పటిక బెల్లం వేసి వుంచి, ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. ఇలా పదిహేను రోజుల పాటు చేస్తే పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) అదుపులోకి వస్తుంది.

4.       గ్లాసుడు పాలలో చిటికెడు పసుపు వేసి పాలను బాగా కాచి, ప్రతిరోజూ ఉద యాన్నే తాగు తుంటే జలుబు దగ్గు, ఆయాసం వంటివి తగ్గు తాయి.

5.       గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ఒక వెల్లుల్లి రేకు ముక్కలుగా చేసి వేసి బాగా మరగనిచ్చాక వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచిది.

6.       దగ్గు, ఆయాసంతో బాధపడేవారు టీ స్పూను అల్లం రసం, టీ స్పూను దానిమ్మ రసం, టీ స్పూను తేనె... ఈ మూడూ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.

7.       చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడు తుంటే రోజూ రెండు స్పూన్ల ద్రాక్షరసం పట్టించటం మంచిది.

8.       అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారు తోటకూర, క్యారెట్, నారింజ రసాలను సమానంగా కలిపి ఆ మిశ్ర మాన్ని రోజుకు మూడుసార్లు తీసుకుం టుంటే గుణం కనిపిస్తుంది.

9.       మూత్ర విసర్జనలో బాధ లేదా మంటగా ఉంటే క్యాబేజీ తినటం మానేయాలి.



Post a Comment

0 Comments