రోడ్డు ప్రమాదంలో మరణించిన కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ 'నాగిరెడ్డి సతీష్ ' కుటుంబన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్ గా పనిచేసే 'నాగిరెడ్డి సతీష్' 18-11-2020 తేదీ సాయంత్రం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందినారు. ఈయన 18 సంవత్సరాల నుండి కాంట్రాక్టు మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్ గా సేవలు అందిస్తున్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి 20 లక్షల రూపాయలు ఎక్సిగ్రేషియో చెల్లించాలని,వారి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఏపీ రాష్ట్ర కాంట్రాక్టు పారా-మెడికల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథ రెడ్డి, కో-కన్వీనర్ యస్.ఖాదర్ భాష లు ఒక పత్రిక ప్రకటన ద్వారా కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన మాట నిలబెట్టుకోవడానికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డియస్సి కాంట్రాక్టు పారా-మెడికల్ ఉద్యోగులు రకరకాలుగా మరణించక ముందే వెంటనే రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేసారు.
0 Comments