రాష్ట్ర మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని AP HAMSA అసోసియేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందించారు, ఈ సందర్భంగా AP HAMSA రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అరవపాల్ గారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలోని 32000 మంది తగిన న్యాయం జరిగేలా చూసేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇప్పటికే అతిపెద్ద ప్రభుత్వ గుర్తింపు సంఘంగా వున్న APHAMSA ప్రతి జిల్లా మరియు ప్రతి తాలూకాలోని అన్ని క్యాడర్లు సహాకారంతో ముందుకు వెళ్తుంది అని, గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అర్థవంతమైన పరిపాలన అందిస్తారని, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఇటీవల కొన్ని మార్పులను పరిగణలోకి తీసుకొని అందరికీ న్యాయం జరిగే విధంగా మార్పులు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ గారు స్పందిస్తూ సమస్యలపై త్వరలో APHAMSA నాయకులతో మాట్లాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హంస సంఘం ప్రతినిధులు వెంకటరమణ గారు, వరప్రసాద్ గారు, జాన్ హెన్రీ గారు, రామకృష్ణ గారు, పాల్గొన్నారు.
0 Comments