lide

Ticker

6/recent/ticker-posts

మున్సిపల్ కమిషనర్ ను కలసిన AP HAMSA



ఈ రోజు వైద్య శాఖలో భాగమై  వార్డు సచివలయాలనందు విధులు నిర్వహిస్తున్న ANMలు విధి నిర్వహణలో అనేక వొత్తిడిలకు  లోనవుతూ సచివాలయాల నందు వైద్య శాఖ విదులే కాకుండా ఇతర శాఖల విధులు నిర్వహిస్తూ రెండు శాఖల అధికారుల మధ్య నలిగిపోతున్న విషయాన్ని  ఏపీ హంస సంఘము జిల్లా అధ్యక్షులు రాజా గారు మునిసిపల్ కమిషర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ గారిని కలసి  సమస్యపై వినతిపత్రం అందివ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మునిసిపల్ కమిషర్ గారు సంబంధిత  అధికారులు పిలిచి వైద్య శాఖ పనులు కాకుండా వేరే శాఖల పనులు ANMs చేయకూడదని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజా, కోశాధికారి ఇమ్రాన్, ముకేష్, జాయింట్ సెక్రటరీ జ్యోతి లక్ష్మీ , సచివాలయ ANMs ఉద్యోగులు మహాలక్ష్మి, కల్పన కుమారి, ప్రభావతి, షాలిని, రూప రాణి మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments