lide

Ticker

6/recent/ticker-posts

తొలగించిన MPHA M ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.


AP HAMSA; 22.12.2024: అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు నందు 22 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న MPHA-M లను  తొలగించడం  చాలా బాధాకరం అని, తొలగించిన MPHA M ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకునే అంశం ప్రభుత్వం మానవతా దృక్పధంతో చూసి న్యాయం చేయాలని అందుకు అనుగుణంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా రాష్ట్రంలోని తొలగించబడిన అందరూ కాంట్రాక్టు ఉద్యోగస్తులను ఒక తాటిపైకి తీసుకువచ్చి వారందరికీ తిరిగి విదులులోకి తీసుకువచ్చే అంశాన్ని సమీక్షించేందుకు ఈరోజు విజయవాడ పట్టణంలో CITU ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం  ద్వారా ఏపీ హంస తరఫున వారందరికీ పూర్తి మద్దతు ఇచ్చి వారంతా ఉద్యోగాలలో చేరేంతవరకు కూడా వారి వెంటే ఉంటామని ఏపీ హంస అధ్యక్షులు శ్రీ అరవ పాల్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ హంస తరుపున జాయింట్ జనరల్ సెక్రెటరీ శ్రీ జాన్ హెన్రీ గారు పాల్గొనడం జరిగింది. 

Post a Comment

0 Comments